Wednesday 29 December 2010

శుభారంభం

హలో .....
వార్తలకు ఏ మాత్రం కొదువ  లేని మన దేశంలో వాటిపై  భిన్నాభిప్రాయాలకు కూడా కొదువ లేదు. మా గొప్ప ప్రజాస్వామ్యం లో కనీసం మన అభిప్రాయాలను మనం వ్యక్తికరించుకొనే స్వేచ్చ ఇంకా మిగిలి వుండడం మన అదృష్టం.
ఇక ఉదయం లేసింది మొదలు చానల్స్ లో చర్చలు, వివిధ మేధావులనబడే వారి అభిప్రాయాలను చూసి చూసి మనం కూడా మన అభిప్రాయాలను ఎవరితో నైన పంచు కోవాలనే కోరిక( దురద) ఈ మధ్య కాలంలో  మరీ ఎక్కువై పోయింది. కాని వినడానికి కూడా ఎవరైనా వుండాలి కదా? మనం వస్తున్నాం అంటే ఫ్రెండ్స్ పారిపోయే పరిస్థితి కూడా కొనితెచ్చుకోలెం కదా.
కానీ పంచుకోవాలి! ఎలా? సరిగ్గా అప్పుడే వచ్చిన ఐడియా ఈ బ్లాగింగు.
బాబు గారి IT విప్లవం  తాలూకు ఫలాలను మనం కూడా అనుభవించగలిగే అవకాశం కూడా ఈ రకంగా లభిస్తుంది.
ఇక నుండి నేను కూడా రాస్తా.....ప్రజాస్వామ్య భారత పౌరుడిగా రాజ్యాగం నాకు కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను నేను సైతం సద్వినియోగం (???) చేసుకుంటా.
నా ఈ ప్రయత్నంలో నా బ్లాగర్ కమ్యూనిటి నన్ను ప్రోత్సహిస్తారని  ఆశిస్తూ..............
ప్రస్తుతానికి సెలవు.